పెదవేగి లోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఏలూరు రేంజి ఐజి అశోక్ కుమార్ సందర్శించారు.చిత్తూరు జిల్లాకు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుల్స్‌తో ఆయన ముచ్చటించారు.పోలీస్ వ్యవస్థ లోకి వస్తున్న యువత అంతా కొత్త రక్తం లాంటి వారని, శిక్షణా కాలంలో శారీరక దృఢత్వంతో పాటు కొత్త చట్టాలపై, BNS, BNSS పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.