ASF: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రిని సమర్థవంతంగా చేపట్టాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం మండలంలోని సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు ఈనెల 11న జరగనున్న పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించి సూచనలు చేశారు.