KNR: హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి నాగేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం మహా దివ్య పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పడి సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పేద పండితులు అవధారుల భాస్కర్ శర్మ, కాట్రపల్లి శ్రీకాంత్ శర్మల మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ పడి పూజ వేడుకల్లో అయ్యప్ప మాల ధరించిన సుమారు 300 మంది స్వాములు, 200 మంది భక్తులు పాల్గొన్నారు.