RR: షాద్‌నగర్ నియోజకవర్గం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యవారిపల్లి గ్రామానికి ప్రధాన సమస్యగా మిగిలిన వంతెన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని, సర్పంచ్ గోపాల్ రెడ్డికి అండగా నిలబెడతానని అన్నారు.