రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు స్వామి భక్తి చూపించడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీలేదు. తమ సీనియర్ నేతలు తమ ప్రాంతానికి వస్తున్నారు అనగానే.. వారి కటౌట్స్ ఏర్పాటు చేయడం.. ఫ్లెక్సీలు పెట్టడం అందరూ చేస్తారు. అయితే… ఓ బీజేపీ నేత మరీ టూమ్ చేశాడనే చెప్పాలి. వినాయకచవితి సందర్భంగా.. గణేషునితో పాటు.. మెదీ విగ్రహం కూడా పెట్టడం గమనార్హం.
వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి వెరైటీగా గణపతిని భుజాలపై ఎత్తుకొని భూలోకానికి తీసుకొస్తున్న ప్రతిమ శివనగర్ లో భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.
నరేంద్ర మోడీ పై ప్రేమతో ప్రత్యేకంగా తయారు చేయించారని తయారీదారులు అంటున్నారు. నరేంద్రమోడీ వినాయకుడు ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. ఈ వినాయకకుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కొందరికి ఇలా మోడీ వినాయకుడు తెగ నచ్చేయగా.. కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కూడా రాజకీయమేనా అంటూ విమర్శలు చేస్తున్నారు.