ప్రేక్షకులను థియేటర్ల(Theatres)కు రప్పించడానికి మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఓటీటీ(Ott’s)ల్లో సినిమాలు చూస్తూ థియేటర్లకు రావడం మానేశారు. అలాంటి వారి కోసం తాజాగా ఓ మూవీ టీమ్ వినూత్నంగా ఆలోచించింది. కేవలం ఒక్క రూపాయికే సినిమా చూసే ఆఫర్‌ను ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.
‘యదా యదా హి’(Yadha Yadha Hi Movie) అనే కన్నడ మూవీ టీమ్ ఈ బంపరాఫర్‌ను ప్రకటించింది. అశోక్ తేజ దర్శకత్వం(Director Ashok teja) వహించిన ఈ సినిమా మర్డర్ మిస్టరీ(murder mystery) నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీ శుక్రవారం విడుదల కానుంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై ఇంకొంచెం క్యూరియాసిటీని పెంచేందుకు చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం ఈ మూవీ ప్రీమియర్ షో(premier Show)ను వేయనుంది.
ఈ ప్రీమియర్ షో(premier Show)కు వచ్చేవారి కోసం మేకర్స్ బంపరాఫర్ ను ప్రకటించారు. బెంగళూరులోని వీరేష్ సినిమాస్, హుబ్బళిలోని సుధా సినిమాస్ థియేటర్లలో కేవలం రూ.1కే సినిమాను చూసే అవకాశాన్ని మేకర్స్ ప్రకటించారు. ఇలా ప్రీమియర్ షోకు రూపాయి పెట్టి సినిమా చూపిస్తే మూవీపై హైప్ క్రియేట్ అయ్యి థియేటర్లకు జనాలను రప్పించేందుకు చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ తెలుగులో అడివిశేష్(Adivisesh) నటించిన ‘ఎవరు’ (Yevaru Movie)రీమేక్ గా తెరకెక్కింది.