ELR: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ ఘటన ఏలూరు రూరల్ శ్రీపర్రు గ్రామంలో ఇవాళ ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఘంటసాల రంగరాజు (55), ఇందుకూరి సుబ్బారావు మార్నింగ్ వాక్ చేస్తుండగా కైకలూరు నుంచి ఏలూరు వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగరాజు మృతిచెందగా సుబ్బారావు తీవ్ర గాయాలపాలయ్యాడు.