MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ల కేంద్రాన్ని స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష పరిశీలించారు. స్థానిక ఎన్నికలలో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఆమె జన్నారంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.