ప్రకాశం: ఎమ్మెల్యే ముక్కు నరసింహ రెడ్డి కృషితో కనిగిరి నియోజకవర్గంలోని ఆలయాలకు రూ. 2.13 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. పెద్ద గొల్లపల్లిలో చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 50 లక్షలు మంజూరయ్యాయి. మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి ఆలయానికి రూ. 83.33 లక్షలు, ఎడవల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ. 80 లక్షలు నిధులు మంజూరయ్యాయి.