ముంబై నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం ఏకంగా 10 గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆపరేషనల్ కారణాల వల్లే ఈ జాప్యం జరిగిందని ఇండిగో సంస్థ తెలిపింది. ఎట్టకేలకు ఈరోజు ఉదయం విమానం ముంబై నుంచి బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.