ELR: రీజినల్ విజిలెన్స్ అధికారి కె. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు దేవులపల్లి, స్థానిక ఉప్పలమెట్టలో రేషన్ షాపులపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బియ్యం, పంచదార నిల్వల్లో భారీ వ్యత్యాసాలను గుర్తించారు. రూ. 8,41,541 విలువైన సరకును సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత డీలర్‌పై నిత్యావసర వస్తువుల చట్టం కింద 6(A) కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.