KNR: గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సీపీ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సూచించారు.