ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ అప్పుడే ఏకంగా ఏడెనిమిది సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ క్యూట్ పిల్ల. అది కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. అందుకే ఇక పై అమ్మడిని టచ్ చేయడం కష్టమే అంటున్నారు.
మామూలుగా అయితే.. చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలుంటేనే.. వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంటారు హీరోయన్లు. కానీ శ్రీలీల మాత్రం అలా కాదు.. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ.. స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది. పెళ్లి సందడితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకుంది శ్రీలీల. ప్రస్తుతం మహేష్ బాబు SSMB28, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలయ్య-అనిల్ రావిపూడి ఎన్బీకె 108, రామ్-బోయపాటి సినిమాతో పాటు.. అనగనగా ఒక రాజు, వైష్ణవ్ తేజ్, నితిన్‌లతో సినిమాలు చేస్తోంది. ఈ సినిమాల్లో సగానికి పైగా సెట్స్ పై ఉన్నాయి.
ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం శ్రీలీల డిమాండ్ ఓ రేంజ్లో ఉందని అంటున్నారు. ఇక పై అమ్మడిని మీడియం రేంజ్ మేకర్స్ టచ్ చేయడం కష్టమే అంటున్నారు. ఇప్పటి వరకు కోటికి అటు ఇటుగా రెమ్యూనరేషన్ అందుకున్న శ్రీలీల.. ఇప్పుడు పారితోషికం డబుల్ చేసేనట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త సినిమాలకు ఏకంగా రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని సమాచారం.
అయితే సినిమాలో ఆమె క్యారెక్టర్ అండ్ డ్యూరేషన్ను బట్టి.. శ్రీలీల రెమ్యునరేషన్ ఉంటుందనే టాక్ కూడా నడుస్తోంది. అయినా కూడా శ్రీలీల డిమాండ్ చూసి.. అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఏదేమైనా.. ప్రజెంట్ శ్రీలీల చేతిలో ఉన్న సినిమాలు రిలీజ్ అయితే.. దీనికంటే డబుల్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని చెప్పొచ్చు.