టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షోలో పెళ్లికి ఎక్స్పైరీ డేట్ ఉంటే బాగుంటుందని కాజోల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. తాజాగా వీటిపై కాజోల్ స్పందిస్తూ.. సరదా సంభాషణల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దని తెలిపింది. దీనిపై ట్వింకిల్ స్పందిస్తూ.. ఈ కార్యక్రమంలో మాట్లాడే వాటిని సీరియస్గా తీసుకోవద్దని, తాము చెప్పే సలహాలు పాటించకండని పేర్కొంది.