KMR: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బోగస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాటలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంజీర వాగు ముంపునకు గురైన రైతులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యలను కవితకు ఏకరువు పెట్టారు.