NDL: డిసెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల గణన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఫేజ్-1 లో భాగంగా శాఖాహార, మాంసాహార జంతువుల లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వన్య ప్రాణుల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. అటవీ శాఖతో పాటు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగనుంది.