KRNL: జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈవ్ టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గురువారం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల వద్ద టీజింగ్ బీట్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.