కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ హుండీల లెక్కింపు నిర్వహించారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 27 వరకు హుండీల ద్వారా రూ. 43,95,359 ఆదాయం లభించిందని, అన్నదాన హుండీ ద్వారా రూ. 52,682 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు.