VKB: పరిగి(M) మల్లెమోనిగూడెంకి చెందిన శివలింగం, శిరీషలకు వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి భార్య శిరీషను వంట సరిగా చేయడం లేదని, తక్కువ చదువుకుందని తరచూ వేధించేవాడు. దీంతో ఆమెను పుట్టింట్లో వదిలేశాడు. రోజు ఫోన్ చేసి నువ్వు నాకు అక్కర్లేదు, అక్కడే చావు అని దూషించడంతో శిరీష తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.