W.G: డిసెంబర్ 3న నిర్వహించనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారా క్రీడల పోటీలను జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. డీఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తొలుత క్రీడలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.