VZM: అధికారులంతా జిల్లా అభివృద్దికి తమవంతు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మెన్ వి.జోగేశ్వర రావు కోరారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ది చెందిందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. అందుకు తమవంతు సహకారం అందిస్తామని అధికారులతో నిర్వహిచిన సమావేశంలో హామీ ఇచ్చారు.