KDP: అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ గురువారం TDP పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజంపేట నియోజకవర్గ TDP ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆమెకు పార్టీ కండువా కప్పి జగన్మోహన్ రాజు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సుబ్బమ్మ తెలిపారు.