W.G: ఈనెల 29న ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో భీమవరం శ్రీ ఎస్.ఆర్.కే.ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొంటాయన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.