CTR: ఏఐసీసీ అబ్జర్వర్ కె.మహేంద్రన్ను పుంగనూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. రాయచోటిలో గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మురళీమోహన్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.