W.G: తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో నిర్మించనున్న పురుగుమందుల పరీక్ష కేంద్రానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. రూ.1.60 కోట్లతో ఈ ల్యాబ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పురుగు మందుల నమూనాలను ఇక్కడ పరీక్షించడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.