ELR: కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ కోరారు. ఈ మేరకు గురువారం సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ పంకజ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి గదులు మంజూరయ్యేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పంకజ్ కుమార్ హామీ ఇచ్చారు.