SKLM: క్రీడలతోనే మానసిక ఉల్లాసం అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఇవాళ రణస్థలం మండలం మత్స్యలేశం ZPH పాఠశాలలో గ్రిగ్స్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయి అని అన్నారు. ఇందులో అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.