CTR: చిత్తూరులో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ ట్రాఫిక్ నియమాలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. మితిమీరిన వేగంతో చేసే ప్రయాణాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు.