CTR: సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మున్సిపల్ ఛైర్మన్ అలీం భాష తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. కొంతమంది మున్సిపల్ సచివాలయ కార్యదర్శులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, నిర్లక్ష్య తీరును మార్చుకోవాలని సూచించారు.