AP: విజయవాడలో మళ్లీ డయేరియా మహమ్మారి ప్రబలుతోంది. పాత రాజరాజేశ్వరి పేటలో ఓ కానిస్టేబుల్ సహా 4 కుటుంబాల్లో డయేరియా పాజిటివ్ నిర్ధారణయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు.. కొద్ది రోజులుగా శానిటేషన్ సమస్య, కలుషిత నీరు కారణంగానే డయేరియా ప్రబలుతోందని ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో డయేరియా బారిన పడి పలువురు మరణించిన సంగతి తెలిసిందే.