TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అత్యంత వెనుకబడిన కులసంఘాలు దీనిపై కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని న్యాయవాది సుదర్శన్ కోర్టును కోరారు. ఎన్నికల వేళ రిజర్వేషన్ల జీవోపై కోర్టులో సవాల్ విసరడం ప్రాధాన్యత సంతరించుకుంది.