CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 మంది సీనియర్ అసిస్టెంట్లు, గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి డిప్యూటీ ఎంపీడీవోలుగా ప్రమోషన్ లభించింది. జడ్పీ నుంచి 46 మంది, పంచాయతీరాజ్ శాఖలో 19 మంది ప్రమోషన్ లభించిన వారిలో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి మండలాలను కేటాయిస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.