ATP: మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ బుధవారం గార్లదిన్నె మండలం ఎగువపల్లి గ్రామానికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వైసీపీ ఎంపీటీసీ విజయలక్ష్మి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీఈఓ కొట్టాల లక్ష్మీనారాయణను కూడా ఆయన పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.