SRPT: నూతనకల్ మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు ధాన్యం లారీ బోల్తాపడి సంఘటన గురువారం ఉదయం జరిగింది. వివరాల్లో వెళ్తే.. మద్దిరాల నుంచి దాన్యం లోడుతో సూర్యపేట వైపు వెళ్తున్న లారీ నూతనకల్ మండల కేంద్రాల్లోకి రాగానే కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయి అధిక లోడుతో ఉన్న ధాన్యం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.