TG: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు ఎస్ఈసీ గుర్తులు కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు మెంబర్లకు 20 గుర్తులు ఇచ్చింది. అయితే ఈ లిస్ట్‌లో చెప్పులు, చెత్త డబ్బా, బిస్కెట్, బెండకాయ, లేడీస్ పర్స్ వంటి వెరైటీ గుర్తులు ఉండటం విశేషం. ఇంకా బ్యాట్, మంచం, టూత్ పేస్ట్ వంటివి కూడా ఉన్నాయి. ఈ విచిత్రమైన గుర్తులు ఇప్పుడు గ్రామాల్లో చర్చనీయాంశమయ్యాయి.