ELR: జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ఒడిశా నుంచి బైక్ పై గంజాయిని తీసుకువస్తుండగా.. సీఐ సుభాశ్, ఎస్ఐ ఎన్వీ ప్రసాద్ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి కేజీ రూ. 630 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు జంగారెడ్డిగూడెం వాసులేనని తెలిపారు.