తిరుమల అన్నప్రసాదంపై యాంకర్ శివజ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో టీటీడీ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భవిష్యత్తులో శ్రీవారిని దర్శించుకోకుండా ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసింది. కాగా శివజ్యోతి క్యూలైన్లో ‘ప్రసాదం అడుక్కుంటున్నాం.. తిరుమలలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం’ అని నవ్వుతూ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.