ప్రకాశం: ఒంగోలులోని డాక్టర్ ఆనంద్ మినీ స్టేడియంలో ఇవాళ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి తెలిపారు. బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను 17 సంవత్సరాల లోపు, అలాగే సీనియర్ కేటగిరీలో 20 సంవత్సరాలలోపు క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9 గంటలకు స్టేడియం వద్ద హాజరుకావాలని కోరారు.