KNR: కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం బుధవారం తనిఖీ చేశారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను, సిబ్బందికి అందించిన కిట్లను పరిశీలించారు. పీఎస్ పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.