PLD: నరసరావుపేట ప్రకాష్ నగర్లోని తిలక్ మున్సిపల్ హై స్కూల్లో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేలా రూపొందించిన ఈ సౌకర్యాలు వారి భవిష్యత్తుకు మేలు చేకూర్చుతాయని అన్నారు.