ELR: గ్రామాల్లో రహదారులు, వంతెనల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేసిందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం నారాయణపురంలో నూతనంగా నిర్మించిన వంతెనను మంత్రి; ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, అధికారులు పాల్గొన్నారు.