TG: కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్, డర్టీ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నేతల జేబుల్లోకి ప్రజాధనం వెళ్తోందన్నారు. మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచించట్లేదు. స్కాముల గురించి ఆలోచిస్తుందన్నారు. వాటాలు, కమీషన్ల కోసమే.. కేబినెట్ మీటింగులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.