MBNR: గిరిజన లంబాడాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలబడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. గిరిజన లంబాడాలను తొలగించాలని ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు.