TG: హైదరాబాద్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లోని NSN ఇన్ఫోటెక్ కంపెనీ పలువురి వద్ద డబ్బు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 400 మంది విద్యార్థుల నుంచి రూ. 3లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇస్తామని విద్యార్థులను మోసం చేసి వసూలు చేసిన డబ్బులతో కంపెనీ డైరెక్టర్ స్వామినాయుడు పరారయ్యాడు.