హన్మకొండ నగరంలో పెగడపల్లి డబ్బాల ఏకశిల హై స్కూల్లో 4వ తరగతి చిన్నారిని ఉపాధ్యాయుడు అమానవీయంగా కొట్టిన ఘటన కలకలం రేపింది. జెడలను పట్టుకుని లేపేంతగా దాడి చేయడంతో చిన్నారికి వీపు, చేతులు, కాళ్లు, ముఖంపై గాయాలు అయ్యాయి. ఘటనపై బుధవారం తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.