W.G: పాలకోడేరు – వేండ్ర రహదారిలోని రైల్వే గేటును అత్యవసర మరమ్మతుల నిమిత్తం రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 28 సాయంత్రం 6 గంటల నుంచి 29 వరకు ఈ గేటు మూసివేత అమల్లో ఉంటుందన్నారు. ఈ దృష్ట్యా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించి, తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.