AP: అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని అన్నారు. ఆవేశం, ఎమోషన్ నియంత్రించుకుంటే ప్రజాస్వామ్మాన్ని కాపాడగలమని చెప్పారు. మహిళలను కించపరిచే మాటలు పలకకూడదని సూచించారు. ఏటా మాక్ అసెంబ్లీని కొనసాగిస్తామని తెలిపారు.