MHBD: తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని MLA డా.భూక్యా మురళీనాయక్, మానుకోట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు భూక్యా ఉమా ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. DCC అధ్యక్షురాలిగా ఉమా ఇటీవల నూతనంగా నియామకం అయినందుకు వేం నరేందర్ ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ముగ్గురు చర్చించారు.