HNK: జిల్లా కేంద్రానికి బుధవారం ఉదయం 11 గంటలకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే KTR రానున్నారు. ఈ సందర్భంగా మొదట ఆయన బీఆర్ఎస్ నేత భరత్ కుమార్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకల్లో పాల్గొని, జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం జనగామ బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్తారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.