ATP: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల దుగ్గుమర్రి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సీఎం యువతని అభినందించారు. ఎవరెస్ట్ లక్ష్యంగా పెట్టుకున్న కుసుమకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు.